Central Government Clarified Assembly Seats Reducing In Telugu States | Oneindia TElugu

2018-12-19 1

Central Government clarified Assembly seats reducing in Telugu States may possible after 2026 cencus only. In Rajyasabha Answer to TDP MP question Central Minister categorically clarified this.
#Assemblyseats
#andhrapradesh
#telangana
#chandrababu
#kcr
#TeluguStates


తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు పై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఏపి పునర్విభ‌జ‌న చ‌ట్టం మేర‌కు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల‌ను పెంచాల్సి ఉంది. అయితే, దీని పై అటు ఏపి..ఇటు తెలంగాణ ప్ర‌భుత్వాలు రాజ‌కీయంగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చాయి. కానీ, అది ఇప్ప‌టి వ‌ర‌కు సాధ్య‌ప‌డ‌లేదు. ఇక‌, ఇప్పుడు కేంద్రం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విష‌యంలో అనుమానాలు లేకుండా తేల్చి చెప్పేసింది. ఏపి పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపి..తెలంగాణ‌ల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉంది. దీని కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌..ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనేక ప్ర‌య‌త్నాలు చేసారు. అప్ప‌ట్లో కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య నాయుడు సైతం సీట్ల పెంపు కోసం న్యాయ‌- హోం శాఖ‌ల అధికారుల‌తో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు.

Free Traffic Exchange